Uttar Pradesh: విషాదం.. ఆలయ గోడ కూలి శిథిలాల కింద నలుగురు సమాధి..!
- ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో విషాదం
- రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలి ఒకరు మృతి
- మరో ముగ్గురికి గాయాలు
- రోడ్డు నిర్మాణం పనులు చేస్తుండగా ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. రోడ్డుకు ఆనుకుని ఉన్న చిత్రగుప్త దేవాలయం గోడ కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్న కార్మికులపై పడింది. దీంతో.. నలుగురు కూలీలపై శిథిలాలు పడ్డాయి. భారీ శబ్దం రావడంతో.. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని శిథిలాల నుండి కూలీలను బయటకు తీసి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ కూలీ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో ముగ్గురు కూలీలకు చికిత్స అందుతోంది.
Read Also: Rishabh Pant: ధోనీ రికార్డును సమం చేసిన టీమిండియా వికెట్ కీపర్..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కొత్వాలి నగర్‌లోని సీతాకుండ్‌లో ఈ ఘటన జరిగింది. అక్కడ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపాలిటీ కాంట్రాక్టర్ అజయ్ సింగ్ చేయిస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా, మధ్యాహ్నం రోడ్డు పక్కనే ఉన్న ఆలయ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడ కూలిపోవడంతో రోడ్డు నిర్మాణంలో నిమగ్నమైన కూలీలు సమీపంలోనే ఉండడంతో నలుగురు కూలీలు గోడ కింద సమాధి అయ్యారు. కార్మికులు రక్షించాలని కేకలు చేయడంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
Matrimonial frauds: మ్యాట్రిమోనీ మోసం.. ఏకంగా 50 మంది మహిళల ట్రాప్..
కాగా.. మృతి చెందిన కార్మికుడు పంకజ్ నిషాద్ (17)గా గుర్తించారు. గాయపడిన వారిలో కొత్వాలి నగర్‌కు చెందిన సోహన్‌లాల్ నిషాద్ (30), రాము నిషాద్ (18), ఛోటు నిషాద్ (17) ఉన్నారు. ఈ ఘటనలో మైనర్‌తో పనులు చేయించుకుంటున్న విషయం వెలుగులోకి రావడంతో కాంట్రాక్టర్ పై తీవ్ర చర్యలు తీసుకోనున్నారు. గతంలో ఆడిటోరియం నిర్మాణంలో ఓ కూలీ మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?