శరీరానికి కావాల్సినంత నీరు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అందుకు రోజుకు 4 నుంచి 8 లీటర్ల నీరు తీసుకోవాలని సూచిస్తారు. కానీ ఇక్కడ ఓ మహిళ ఒక్కరోజులో తాగాల్సిన నీరు ఒకేసారి తాగింది.. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఇంకేముంది ఆ మహిళ చనిపోయింది. అయితే ఆమే తాగిన నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు తాగడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Sruthi Shanmuga Priya: పుట్టెడు దుఃఖంలో ఉన్నాం.. లైకుల కోసం మమ్మల్ని వేధించకండి!
యాష్లే సమ్మర్స్ అనే 35 ఏళ్ల మహిళ.. జూలై నాలుగవ వారాంతంలో తన భర్త, ఇద్దరు చిన్న కుమార్తెలతో లేక్ ఫ్రీమాన్ వద్దకు వెళ్లింది. ఆమె అక్కడ ఎక్కువగా వాటర్ తాగింది. 20 నిమిషాల్లో నాలుగు బాటిళ్ల నీరు తాగింది. సగటు వాటర్ బాటిల్ 16 ఔన్సుల ఉంటుంది. అంటే 20 నిమిషాల వ్యవధిలో 64 ఔన్సులు తాగింది. అది సగం గాలన్. అదే మీరు ఒక రోజంతా తాగాలి. దీంతో ఆమెకు తలనొప్పి సమస్య వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత.. అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పటికీ స్పృహ రాలేదు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. మెదడు వాపు ఉందని, అంతేకాకుండా నీటి విషపూరితం కారణంగా ఆమె మరణించిందని తెలిపారు. అధిక మొత్తంలో నీటిని తాగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.