ఏపీలో పనిచేస్తున్న ఐఏఎస్ క్రిస్ట్ కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద మృతి చెందింది. త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న దీపిక ను ఆయుష్ ఆసుపతిలో డిసెంబర్ 31న చేర్చారు కుటుంబ సభ్యులు. డిసెంబర్ 31న స్థానిక ఆయుష్ ఆసుపత్రిలో చేరిన సత్య గీతిక ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతి పై అనుమానాలు ఉన్నాయని సత్య గీతిక సోదరి సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా గోదావరి కెనాల్ పీడీ గా పనిచేస్తున్నారు.