ఐద్రోజుల క్రితం హైదరాబాద్‌లో ర్యాష్ డ్రైవింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో బీటెక్ స్టూడెంట్ శివాని (21) అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ పై వెళ్తుండగా స్కోడా కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు వెంకట్ రెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. వెనుకాల కూర్చున్న శివాని చనిపోయింది. అయితే.. తాజాగా ర్యాష్ డ్రైవింగ్‌కి మరో యువకుడు బలయ్యాడు.
Read Also: Manmohan Singh: మన్మోహన్ సింగ్ కోసం భూటాన్ ప్రత్యేక ప్రార్థనలు..
కోకాపేట్ సర్వీస్ రోడ్డులో బైక్ డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ క్రమంలో.. బైక్ పై వెళ్తున్న విద్యార్థి స్వాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా.. అతని పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే గాయపడిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని అన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also: HCA: అండర్19 టీ20 వరల్డ్‌కప్‌కు తెలంగాణ క్రికెటర్లు ఎంపిక.. ఘనంగా సన్మానం