Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా 'డైమండ్' ఇప్పటికీ సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కానీ.. ప్రస్తుతం ఈ రిచ్ బిజినెస్ తీవ్ర 'పేదరికం'లో సాగుతోంది. ఏకంగా 7 వేల కంపెనీలు నష్టాలను చవిచూడగా.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది.
కర్నూలు జిల్లాలో ఒకే రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వజ్రాల కోసం పలువురు రోజుల తరబడి ప్రయత్నాలు చేస్తుంటారు. జిల్లాలోని తుగ్గలి (మం) జొన్నగిరిలో ఒకేరోజు రెండు వజ్రాలు లభ్యమయ్యాయి. ఒక వజ్రానికి 6 లక్షలు ఆరు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు. మరో వజ్రాన్ని నిర్వాహకులు ఇంకా వేలం వేయలేదు. ఈ వజ్రం విలువ రూ. 12 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారం రోజుల్లో గుట్టు…
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం.
ప్రతి మధ్యతరగతి వారికి ఎప్పుడో ఒకప్పుడు తమకు లక్ కలిసి వస్తుంది వెంటనే రిచ్ కిడ్స్ అయిపోతాం అనే ఆశలు ఉంటాయి. ఏదో ఒక రోజు లాటరీ తగులుతుందని లేదా రోడ్డుపై డైమెండ్స్, డబ్బు సంచులు దొరుకుతాయనే ఆశలు ఉంటాయి. ఆ ఆశతోనే రోడ్డుపై కొంతమంది జనం వెతుకులాట ప్రారంభించారు. ఓ వ్యాపారి పొరపాటున తన వజ్రాల ప్యాకెట్ పొగొట్టుకున్నాడని తెలిసి వారంతా ఇలా రోడ్డుపై పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్…
ఏదైనా ప్రాంతంలో వజ్రాలు దొరకుతాయంటే ఎవరైనా ఊరికే ఉంటారా?. వెంటనే వజ్రాల కోసం వేట ప్రారంభించేస్తారు కదా. అలాంటి సంఘటనే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో భారీగా ప్రజలు అక్కడికి తరలివచ్చి వజ్రాల వేటను ప్రారంభించారు.
బెంగళూరు సౌత్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన మొబైల్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బు, వజ్రాలు కావాలంటూ గుజరాత్‌లోని భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) నాయకుడికి తేజస్వి సూర్య ఫోన్ నుంచి కాల్స్ వెళ్లినట్లు ఆ ఫిర్యాదులో ఎంపీ తేజస్వీ పీఏ ప్రకాశ్ పేర్కొన్నారు.
Diamonds Theft: గుజరాత్‌లోని ప్రముఖ వజ్రాల వ్యాపారిని మోసగించిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఆదివారం ప్రకటించింది. ఒక గుజరాత్ వజ్రాల వ్యాపారిని ముంబైకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిబ్రవరిలో సంప్రదించారు.
Diamond Auction : సూరత్ అంటే వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు అనే విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల నుంచి వెలికితీసిన డైమండ్లకు నిర్వహించిన ఈ–వేలంలో గుజరాత్ లోని సూరత్, ముంబై, పన్నా ప్రాంతాల్లోని వర్తకులు పాల్గొంటారు.