Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
Read Also: H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..
50 ఏళ్ల స్థానిక నివాసి రచనా గోల్డర్ మొత్తం 2.53 క్యారెట్ల బరువు ఉన్న 8 విలువైన రాళ్లను కనుగొన్నారని, వీటిలో 06 అధికా నాణ్యత కలిగినవని అధికారి తెలిపారు. అతిపెద్ద వజ్రం 0.79 క్యారెట్ల బరువు ఉంది. గోల్డర్ ఆ రాళ్లను జిల్లా డైమండ్ ఆఫీస్‌లో జమచేశారు. వీటిని వేళంలో ఉంచుతామని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని వజ్రాల నిపుణుడు అనుపమ్ సింగ్ చెప్పారు. ఒక్కో దాని విలువ సుమారుగా రూ. 4-6 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.
ముగ్గురు పిల్లల తల్లి అయిన గోల్డర్, హజారా ముద్దా ప్రాంతంలో మైనింగ్ లీజు తీసుకుని తవ్వుతున్నప్పుడు ఈ వజ్రాలనున కనుగొన్నారు. వేలం ద్వారా వచ్చే డబ్బుతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పన్నాలో 8 మీటర్ల మైనింగ్ ప్లాట్‌ను ఏటా రూ. 200 కు లీజుకు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పాల్గొనే వజ్రాల వేలం ప్రతీ 3 నెలలకు ఒకసారి జరుగుతుంంది. తుది వేలం ధర 11 శాతం రాయల్టీ, 1 శాతం టీడీఎస్‌తో సహా 12 శాతం ప్రభుత్వ మినహాయింపుకు లోబడి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని వజ్రాలను కనుగొన్న వ్యక్తికి ఇస్తారు.