ప్రతి మధ్యతరగతి వారికి ఎప్పుడో ఒకప్పుడు తమకు లక్ కలిసి వస్తుంది వెంటనే రిచ్ కిడ్స్ అయిపోతాం అనే ఆశలు ఉంటాయి. ఏదో ఒక రోజు లాటరీ తగులుతుందని లేదా రోడ్డుపై డైమెండ్స్, డబ్బు సంచులు దొరుకుతాయనే ఆశలు ఉంటాయి. ఆ ఆశతోనే రోడ్డుపై కొంతమంది జనం వెతుకులాట ప్రారంభించారు. ఓ వ్యాపారి పొరపాటున తన వజ్రాల ప్యాకెట్ పొగొట్టుకున్నాడని తెలిసి వారంతా ఇలా రోడ్డుపై పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Also Read: Mutual Fund: మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి గుజరాత్‌లోని సూరత్ పట్టణం. వజ్రాల కొనుగోలు, అమ్మకానికి ప్రసిద్ధి చెందిన వరచ్చా ప్రాంతంలో ఓ వ్యాపారి పొరపాటున తన వజ్రాల ప్యాకెట్‌ను జారవిడిచినట్లు ఆ ప్రాంతంలో పుకార్లు వ్యాపించాయి. అయితే ఆ ప్యాకెట్లో కోట్లు విలువ చేసే వజ్రాలు ఉన్నట్లు కొంతమంది మెసేజ్ లు పంపారు. అవి దొరికితే ఇవ్వాలంటూ కోరారు. అయితే ఆ వార్త అంతటా వ్యాపించడంతో ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఆ రోడ్డుపై పడిపోయారు. వెంటనే వెతకడం మొదలు పెట్టేశారు. చాలా మంది రోడ్డుపై కూర్చొని శ్రద్దగా అణువణువు వెతుకుతుంటే కొందరు చీపురుతో సైతం రోడ్డును ఊడ్చేస్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డుపై వస్తున్న వాహనాలను సైతం ఆపేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. అయితే కొంతమందికి కొన్ని వజ్రాలు దొరికినా అవి అసలైనవి కావు ఇమిటేషన్ జ్యూలరీలో వాడే అమెరికన్ డైమండ్స్ అని తేలింది. దీంతో ఎంతో కష్టపడి వెతికిన వారంతా ఊసూరుమన్నారు. అయితే ఆ మెసేజ్ లు ఉత్తివే అని ప్రాంక్ అయి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
#સુરત વરાછા મિનિબજાર રાજહંસ ટાવર પાસે હીરા ઢોળાયાની વાત થતા હીરા શોધવા લોકોની ભીડ થઈ.
પ્રાથમિક સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે આ હીરા CVD અથવા અમેરિકન ડાયમંડ છે..#Diamond #Surat #Gujarat pic.twitter.com/WdQwbBSarl— 𝑲𝒂𝒍𝒑𝒆𝒔𝒉 𝑩 𝑷𝒓𝒂𝒋𝒂𝒑𝒂𝒕𝒊 🇮🇳🚩 (@KalpeshPraj80) September 24, 2023