Mumbai Airport: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ.1.49 కోట్ల వజ్రాలు సీజ్.. ఒకరి అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Airport: బంగారానికి, వజ్రాలకు చాలా విలువ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే కేటుగాళ్లు ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. విదేశాల నుంచి భారత దేశానికి తీసుకువచ్చి అమ్ముకోవడం లేదా.. ఇండియా నుంచి తీసుకెళ్లి విదేశాల్లో అమ్ముకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇలా చేస్తున్న కేటుగాళ్లల్లో కొందరు విమానాశ్రయాల్లో అధికారులకు పట్టుబడుతుంటారు. అలాంటి ఘటనే దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయంలో జరిగింది. ముంబయి విమానాశ్రయంలో భారీగా వజ్రాలను పట్టుకున్నారు. రూ. 1.49 కోట్ల విలువ చేసే వజ్రాలను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వజ్రాలను విదేశాలకు తరలించడానికి ప్రయత్నించి ప్రయాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వజ్రాలను డీ ఫౌడర్‌లో కలిపి తరలించేందుకు ప్రయత్నించి నిందితుడు. వజ్రాలతో దుబాయ్‌కి వెళుతున్న ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు.
Read also: Snake Farming: ఆ ఊర్లో పాములే అట్రాక్షన్.. కోట్లు సంపాదిస్తూ కోటలు కట్టేస్తున్నారు
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళుతున్న ఒక భారతీయుడిని అరెస్టు చేసి .. అతని వద్ద నుంచి రూ. 1.49 కోట్ల విలువైన 1559.6 క్యారెట్ల సహజసిద్ధమైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాలను విదేశాలకు తరలించే ప్రయత్నం చేసిన నిందితుడిని బుధవారం అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వజ్రాలను టీ ప్యాకెట్‌లో చాకచక్యంగా దాచి ఉంచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అంతకుముందు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం వెనుక టాయిలెట్ నుండి సుమారు రూ. 85 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్లెయిమ్ చేయని రెండు బ్యాగుల్లో బంగారం పేస్ట్ రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 1,709 గ్రాములు ఉంటుందని అధికారులు తెలిపారు. “ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నుండి అందిన సమాచారం ఆధారంగా, AUH నుండి విమానం 6E 1404 వెనుక టాయిలెట్ నుండి రెండు క్లెయిమ్ చేయని బ్యాగుల్లో బంగారాన్ని పేస్ట్ రూపంలో స్వాధీనం చేసుకున్నట్టు కొచ్చిన్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. రికవరీకి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!