Today Business Headlines 05-04-23: ముగ్గురూ.. ముగ్గురే..: క్రీడా రంగంలో.. ముఖ్యంగా క్రికెట్‌లో.. కోహ్లి, ధోని, రోహిత్ శర్మ.. ఈ ముగ్గురూ వాణిజ్య ప్రకటనలతో దూసుకెళుతున్నారు. ఒక్కొక్కరూ కనీసం 30 బ్రాండ్లకు ప్రచారం చేస్తున్నారు. మొత్తం 505 సంస్థలు సెలెబ్రిటీలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకోగా.. అందులో ఏకంగా 381 ఒప్పందాలను క్రికెటర్లతోనే కుదుర్చుకోవటం విశేషం. మొత్తం డీల్స్ వ్యాల్యూ 749 కోట్ల రూపాయలు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్రలో ప్రావీణ్యం సంపాదించాడని.. భారత మాజీ కెప్టెన్ దగ్గరికి ఎవనూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన అభిప్రాయని వెల్లడించాడు.
ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ చెన్నై, ఐపీఎల్ ను ట్యాగ్ చేశాడు. సీఎస్కే స్టోక్స ఎంట్రీకి సంబంధించిన వీడియోను ఇవాళ తన ట్విట్టర్ లో రీలిజ్ చేసింది.
ఐపీఎల్ ఆరంభానికి ముందే ఫారిన్ ప్లేయర్స్ ఒక్కొక్కొరుగా జట్లకు దూరమవుతూ ఫ్రాంఛైజీలకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు టీమ్స్ కు సంబంధించి కీలక ఆటగాళ్లు ఆయా జట్లకు దూరమయ్యారు.
ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అని ఎవరు చెప్పారు? టీమ్ లో ఎవ్వరూ కూడా ఇది మహీ భాయ్ లాస్ట్ సీజన్ అని చెప్పలేదు. కనీసం మహీ భాయ్ కూడా ఇలా చెప్పలేదు అని సీఎస్కే బౌలర్ దీపక్ చాహార్ అన్నారు.