ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో భాగంగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. అయితే ఈ మ్యాచ్ లో హీరో ఎవరని అడిగన టక్ మని వినిపించే పేరు అజింక్యా రహానే అని. ముంబై ఇండియన్స్ నిర్థేశించిన 158 పరుగులు అనేది కాపాడుకోగలిగిన లక్ష్యమే కానీ.. రహానే చేసిన విధ్వంసానికి ముంబై విధించిన టార్గెట్ చిన్నదైపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే రహానేలో ఇంత ఫైర్ దాగుందా అన్నట్లుగా ఆడిన అతను పెనే సంచలమే సృష్టించాడు. బంతి పడిందే ఆలస్యం బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న రహానే పనిలో పనిగా సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అజింక్యా రహానే 19 బంతుల్లోనే అర్థశతకం మార్క్ అందకున్న రహానే జోరు చూస్తే సెంచరీ చేసేలా కనిపించాడు.. కానీ చివరకు 27 బంతుల్లో 61 పరుగులు చేసి ఔటయ్యాడు.
Also Read : CSK vs MI : ముంబైపై 7 వికెట్ల తేడాతో చెన్నై గెలుపు
అయితేనేం అప్పటికే తన విధ్వంసకర ఇన్సింగ్స్ తో ముంబై దగ్గర నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతు ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ కు ముందు తనకు ఏం చెప్పి పంపించాడో రివీల్ చేయడం ఆసక్తి కలిగించింది. ఈ రోజు ఆటను బాగా ఎంజాయ్ చేశాను.. టాస్ కు కొద్ది నిమిషాల ముందే నేను తుది జట్టులో ఉన్నట్లు తెలిసింది. మొయిన్ అలీ ఈ మ్యాచ్ ఆడడం లేదని.. అతని స్థానంలో నువ్వు ఆడుతున్నావని కోచ్ ప్లెమింగ్ చెప్పాడు. ఆడింది. రంజీ ట్రోఫీ అయినప్పటికీ ఈ సీజన్ లో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాను.. ఈ మ్యాచ్ లో దానిని కొనసాగించాలనుకున్నాను అని రహానే అన్నారు. ఇక మహీ భాయ్ నేను బ్యాటింగ్ రావడానికి ముందు ఒకటే చెప్పాడు.. బాగా ప్రిపేర్ అవ్వు.. నీపై ఉన్న నమ్మకంతో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపిస్తున్నా… వెళ్లి ఆటను ఎంజాయ్ చెయ్యు.. ఒత్తిడిని మాత్రం దరి చేరనీయకు.. మేమంతా నీకు సపోర్టుగా ఉన్నాం.. ఈ రోజు ఆట నీది… బాగా ఆడు.. అని చెప్పినట్లు రహానే పేర్కొన్నాడు.
Also Read : Janhvi Kapoor: అమ్మో నీ అమ్మ గొప్పదే.. అందం పోగేసి కన్నదే