మరో ఐదు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రత్యేకమైనది. మూడు సంవత్సరాల తర్వాత, చెన్నై అభిమానులు తమ అభిమాన జట్టును చెపాక్‌లో చూడగలరు. ఇది సీఎస్కే కెప్టెన్ MS ధోనీకి చివరిది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా CSK పటిష్టమైన జట్లను కూడా ఓడించింది. లీగ్‌లో నాలుగుసార్లు గెలిచిన వారి విజయమే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అయినప్పటికీ, ధోనీ టీమ్ కి వయసు భారం పడుతుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నారు.
Also Read : Minister Suresh Safe: మంత్రి సురేష్ కి తప్పిన ప్రమాదం
ఇది CSK పతనానికి నాంది పలకబోతుందా? అని మాథ్యూ హేడెన్ అన్నారు. MS ధోని నేతృత్వంలోని డాడీస్ సైన్యంకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వారులో కొంత మందిపై వయసు భారం పైన పడుతుంది. సీఎస్కే ఇప్పుడు ఒక రకమైన తండ్రి సైన్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హేడెన్ స్టార్ స్పోర్ట్స్‌కి చెప్పారు. ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు ఇంచుమించు ఒకే వయసులో ఉన్నారు.. అక్కడ వారు జట్టుకు నాయకులుగా మాత్రమే కాకుండా, నిజంగా కీలక ఆటగాళ్లుగా ఉండాల్సిన అవసరం ఉంది.. కాబట్టి ముఖ్యంగా ఆ ఇద్దరు కీలక ఆటగాళ్లు, వారి వయస్సుతో అది సాధ్యమవుతుందా అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ అన్నారు.
Also Read : Threat Call : ఫుల్‌గా తాగాడు.. ఫోన్ చేసి సీఎం ఇంటినే పేల్చేస్తా అన్నాడు
నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిచి.. గత టోర్నీలో మాత్రం తొమ్మిదో స్థానంలో నిలిచింది. రవీంద్ర జడేజా కెప్టెన్‌గా సీజన్‌ను ప్రారంభించాడు, అయితే అతను ఒత్తిడి, ఆందోళనకరమైన ఫామ్‌తో తన స్థానాన్ని విడిచిపెట్టాడు. MS ధోని మరోసారి కెప్టెన్ అయ్యాడు.. కానీ అప్పటికే CSKకి జరగాల్సిన నష్టం జరిగిందని మాథ్యూ హేడెన్ అన్నాడు. ఈ కొత్త సీజన్‌లో ఓపెనింగ్ జోడి అయిన డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత బెన్ స్టోక్స్ ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టోక్స్ బ్యాటింగ్ లైనప్‌కు భారీ పటిష్టతను అందించాడు.. అతను నంబర్ 4లో అనుభవజ్ఞుడైన అంబటి రాయుడు నుంచి మంచి మద్దతు పొందగలడు అని మాథ్యూ హేడెన్ చెప్పుకొచ్చారు.
Also Read : Chindepally Tension: తిరుపతి జిల్లా చిందేడులో ఉద్రిక్తత
మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలు ముగ్గురు అద్భుతమైన ఆల్ రౌండ్ ర్ లను ఎంపిక చేసుకున్నారు. MS ధోని తన జట్టుతో కలిసి ఐదవ సారి IPL టైటిల్ సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. దేశవాళీ క్రికెట్ లో మెరిసిన దూబే, ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో తను కోల్పోయిన టచ్‌ను తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత సీజన్‌లో బౌలింగ్ విభాగం అంత బలంగా లేదు.. కానీ దీపక్ చాహర్ పునరాగమనంతో జట్టుకు మరింత బలం చేకురింది. సీఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే ముఖేష్ చౌదరి, శ్రీలంక బౌలర్ మహేశ్ తీక్షణను చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్రధాన స్పిన్నర్‌గా భావిస్తుంది.