Dhoni: క్రికెటర్ ధోని ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి నచ్చిన పనులు చేస్తూ, జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ధోని త్వరలో సినిమా రంగంలోకి రానున్నాడు, సినిమాలు నిర్మించబోతున్నాడు అని పలు వార్తలు వచ్చాయి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మోకాళ్ల నొప్పులకు ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడు. తన సొంతూరు రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద కూర్చుని వైద్యం చేసే వందన్ సింగ్ ఖేర్వార్ వద్ద ధోనీ చికిత్స పొందుతున్నాడు. క్యాల్షియం లోపం కారణంగా ధోనీకి మోకాళ్ల నొప్పులు వచ్చినట్లు వైద్యులు తెలియజేశారు. అయితే ఎంతమంది వైద్యం చేసినా ధోనీకి ఉపశమనం లభించలేదు. అయితే తన తల్లిదండ్రుల సూచనతో చెట్టుకింద…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మంచి ఫినిషర్ అనే ముద్ర వేయించుకున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ధోనీ తరహాలో ఆడే ఫినిషర్ కోసం టీమిండియా గాలిస్తూనే ఉంది. అయితే తాజాగా టీమిండియాకు ధోనీ తర్వాత మరో ఫినిషర్ దొరికేశాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడిన దినేష్ కార్తీక్ ధోనీ స్థానంలో ఫినిషర్ రోల్ పోషించగలడని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌లో దినేష్ కార్తీక్…
IPL అంటే ఒకప్పుడు CSK జట్టుతో ఏ జట్టు ఫైనల్ ఆడుతుందో దాన్నే IPL అని అంటారు అనే స్థాయిలో ఆ జట్టు IPL ని ఒక ఊపు ఊపింది. అయితే ఇదంతా ఒకప్పటిమాట తాజాగా జరిగిన IPL 2022 సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ గా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలే సాధించిన CSK పాయింట్స్…
గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా 6, 4, 2, 4 సాధించాడు. దీంతో తనలో పవర్ తగ్గలేదని ధోనీ చాటిచెప్పాడు. అయితే ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం…
టీమిండియాకు ఎన్నో విజయాలు అందించి విజయవంతమైన సారథిగా పేరుతెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టం. ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ ధోనీకి మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు విదేశీ క్రికెటర్లు కూడా ధోనీ ఆటను, క్యారెక్టర్‌ను ఇష్టపడుతుంటారు. ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఉన్నాడు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ ధోనీ అంటే ఎంతో అభిమానం. ఇటీవల దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్ ముగిశాక రౌఫ్ ప్రత్యేకంగా…
క్రికెట్ కి , సినిమాకు అవినాభావ సంబంధం ఉంది. ఇక క్రికెటర్లకు, సినిమా హీరోయిన్ల మధ్య ప్రేమ వ్యవహారాలు ఉండడం సాధారణంగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు, తాము ప్రేమించిన హీరోయిన్లను పెళ్లి చేసుకొని సంతషంగా ఉండగా.. మరికొంతమంది బ్రేకప్ చేసుకొని మరొకరిని వివాహం చేసుకున్నారు. అలా బ్రేకప్ చేసుకున్న జంటల్లో మహేంద్ర సింగ్ ధోని- లక్ష్మీ రాయ్ జంట కూడా ఒకటి. 2008లో ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ ఉండగా.. అదే…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి టీ20లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. సూర్యకుమార్ యాదవ్ డకౌట్‌గా వెనుతిరిగాడు. చివర్లో దీపక్…
యూఏఈలో ముగిసిన ఐపీఎల్ 2021 లో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ధోని భవిష్యత్ పై చాలా ప్రశ్నలు వస్తున్న విషయం తెలిసిందే. తాను వచ్చే ఏడాది ఐపీఎల్ అడవుతాడా.. లేదా అనేదాని పై చాలా ప్రశ్నలు వచ్చాయి. అయితే గతంలో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నైలోనే ఆడుతాను అని చెప్పిన ధోని మరోసారి అవే వ్యాఖ్యలు చేసాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ధోని మాట్లాడుతూ… నేను…
ధోనికి మన దేశంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెపాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ అభిమాని ధోని కోసం 1436 కిలోమీటర్లు నడిచాడు. హర్యానాకు చెందిన అజయ్ గిల్ అనే ధోని అభిమాని 1436 కిలోమీటర్లు నడిచి రాంచీకి చేరుకుని తన ధోనీని కలిసాడు. అయితే గత మూడు నెలల్లో గిల్ రాంచీ ధోనిని చూసేందుకు కాలినడకన వెళ్లడం ఇది రెండోసారి. అతను చివరిసారి రాంచీకి వచ్చినప్పుడు అతనికి 16 రోజుల సమయం పడితే..…