చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషర్ పాత్రలో ప్రావీణ్యం సంపాదించాడని.. భారత మాజీ కెప్టెన్ దగ్గరికి ఎవనూ రాలేదని రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ తన అభిప్రాయని వెల్లడించాడు. గౌహతికి చెందిన 21 ఏళ్ల యువకుడు.. ఈ ఏడాది ఐదవ ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఒకవేళ అవకాశం వస్తే టోర్నమెంట్ లో నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అంటూ పరాగ్ వెల్లడించాడు.
Also Read : Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీలోకి సొరంగం.. భారీ దోపిడి..
రాజస్థాన్ రాయల్స్ నన్ను అడిగితే.. నేను నెంబర్ 4 అని చెబుతా అంటు రియాన్ పరాగ్ తెలిపాడు. అయితే ఎప్పటిలాగే.. జట్టుకు అవసరమైన చోట.. నేను ఉత్తమంగా సరిపోతాను అని వాళ్లు అనుకుంటే ఏ స్థానంలోనైనా బ్యాంటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రియాన్ పరాగ్ అన్నాడు. నేను గత మూడేళ్ల నుంచి ఫినిషర్ రోల్ పోషిస్తున్నాను అని వెల్లడించాడు. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను.. ఎంఎస్ ధోనీ అనే ఒక్క పేరు మాత్రమే నాకు గుర్తుకు వస్తుంది అని పరాగ్ పేర్కొన్నాడు.
Also Read : Samantha: ఇంట్లో కూర్చో.. ఇలాంటివి చేయకు అన్నారు.. చైతన్యతో విడాకులపై నోరువిప్పిన సామ్
ఆ కళను మరెవరూ సాధించారని నేను అనుకోను.. ఆ పాత్రలోకి వెళ్తున్నాను.. నేను ఎల్లప్పుడూ అతనిని చూస్తాను.. అతను గేమ్ లను ఎలా పూర్తి చేస్తాడు అంటూ రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. గత నాలుగు ఎడిషన్లలో టీ20 పోటీలో పెద్దగా కలిసిరాని సమయంలో అస్సాంకు.. విజయవంతమైన ఐపీఎల్ సీజన్ లో బలమైన ప్రదర్శన చేశానని పరాగ్ తెలిపాడు. గత సీజన్ లో ఐపీఎల్ లో కేవలం ఒక అర్థ సెంచరీ మాత్రమే చేశాడు.. 17 ఇన్సింగ్స్ లో కలిపి 16.64 సగటుతో 183 పరుగులు చేశాడు.
Also Read : Sourav Ganguly : రోహిత్ శర్మకు గంగూలీ సూచన.. హార్దిక్ పాండ్యాకే పగ్గాలు..?
2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పరాగ్.. 2022-2023లో విజయ్ హజారే ట్రోఫీలో అత్యుత్తమ స్కోరర్ గా నిలిచాడు. ఐదవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. 552 సగటుతో తొమ్మిది ఇన్సింగ్స్ లో 969 పరుగులు చేసి.. మూడు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో రెండు అర్థ శతకాలు కొట్టిన పరాగ్ 165.35 స్రైక్ రేట్ తో 253 పరుగులు చేశాడు.