ఏపీలో అధికారపార్టీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసింది. ప్రభుత్వపరంగా, పార్టీ రీత్యా అంతా సెట్ చేస్తున్నరు అధినేత. ఇప్పటి నుంచే నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌కు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు కృష్ణదాస్‌కు భారంగా మారబోతున్నట్టు టాక్. సౌమ్యుడిగా పేరున్న ఆయన గ్రూపుల గోలను ఏ విధంగా సెట్ చేస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాలు మరొ కొన్ని రాష్ట్రాలు కూడా వారివారి రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రతి పక్షాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ ప్రభుత్వం రాష్ట్ర సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటన…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం! రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ…
రైతు దినోత్సవాన్ని రైతు దగా దినోత్సవంగా అభివర్ణించడం బాధాకరం అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే… టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ప్రభుత్వం ఏ పనిచేస్తున్నా టీడీపీ నాయకులు వక్రీకరిస్తున్నారు. రైతులను టీడీపీ నాయకులు మభ్యపెడుతున్నారు. గతంలోనూ నేను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులది వక్రబుద్ధి అని తెలిపారు ఆయన. స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తే..ప్రజలు వారికి ఎన్ని స్థానాలు ఇచ్చారో తేలిపోతుంది. చంద్రబాబుతో…