కేసీఆర్ రాజు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గడీల నుంచి బయటకు రాడని విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజలను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. చేసిన తప్పులను సమర్థించుకునే మూర్ఖడు రాష్ట్ర ముఖ్యమంత్రి అని విమర్శించాడు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాలు ధరణిలో నమోదు కాలేదని.. నమోదైన వాటిలో 50 శాతం తప్పులే ఉన్నాయని అన్నారు. . ధరణి అనేది గొప్ప పోర్టల్ అని చెబుతున్నాడని.. సీఎంది నోరా మోరా అని విమర్శించారు.…
ధరణి పోర్టల్ ఒక అద్భుతం అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం ఉదయం ములుగు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ధరణి పోర్టల్ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ధరణి పోర్టల్ సమస్యలపై హరీష్‌రావు ముఖా ముఖి నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు గ్రామ రెవెన్యూ సమస్యలు తీర్చి ఇదే విధంగా రాష్ట్రం అంత చేద్దాం అని ఆలోచన ఉందన్నారు. గతంలో రిజిస్ట్రేషన్ కోసం అనేక సమస్యలు ఉండేదని తెలిపారు. ధరణి వచ్చాక…
Meenakshi Natarajan Sarvodaya Sankalp Padayatra at Medak District. భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ..…
రాష్ట్రంలో రక్షణ కరువయిందని కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కిడ్నాప్ లు, హత్యలు మామూలు అయిపోయాయని, ల్యాండ్ డీల్స్ కు తెలంగాణ కేంద్రంగా మారిందని ఆమె ఆరోపించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ధరణి పోర్టల్ సృష్టించిన ఇబ్బందుల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆమె అన్నారు. వేల మంది రైతులు నా దగ్గరకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటుంన్నారని, ఎప్పుడో అమ్మిన భూముల యాజమాన్య హక్కులు మారడం లేదని…
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆది నుంచే సమస్యలకు నెలవైంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి దానిలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఎంతో మంది రైతులు పేర్లు మారిపోవడం.. గుంట స్థలం ఉన్నవారికి ఎకరా స్థలంగా నమోదైతే.. ఇక ఎకరాల భూమి ఉన్న రైతు గుంట స్థలానికి యజమానికిగా చూపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఎప్పటికప్పడు అధికారులు ధరణి పోర్టల్‌ను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్…