ధరణి పోర్టల్‌పై ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎంత మొత్తుకున్నా .. అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని ఆయన విమర్శించారు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులను భయపెట్టి, అక్రమ కేసులు పెట్టి భూమిని ఆక్రమించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో నిషేధిత జాబితాలో ఉన్న భూములను…
ధరణి పోర్టల్‌లోని లోపాలపై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందని, కానీ కాంగ్రెస్ సూచనలను, సలహాలను కేసీఆర్ పట్టించుకోలేదని ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ధరణిలో లోపాలను సరిచేసేందుకు హరీష్ రావు కమిటీ కేవలం కంటి తుడుపు చర్యనేనని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు ఎవ్వరితోనూ పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని, గ్రామాల్లో తర తరాలుగా వ్యవసాయం చేసుకునే రైతుల హక్కులను ధరణితో భంగం కలిగిందని ఆయన మండిపడ్డారు.…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం…
తెలంగాణ ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌లో భారీ మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నిషేధిత భూముల తొలగింపు, కొత్త మాడ్యూల్స్‌తో సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మిస్తే రైతు బంధు కట్ చేయాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. మరోవైపు ధరణి పోర్టల్ వచ్చాక లక్షల ఎకరాల్లో భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. దీంతో కలెక్టర్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. Read Also:…
రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ‘ధరణి’ పోర్టల్‌ను తీసుకొచ్చారు.. మధ్యవర్తుల అవసరం లేకుండా.. లంచాలు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు.. ధరణి అందుబాటులోకి వచ్చేముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.. తెలంగాణలో ధరణి శకం మొదలై ఏడాది పూర్తయింది. అత్యాధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా…
పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ వ్యవస్థపై వారికి అవగాహన కల్పించారు సీఎస్. ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్ ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ రికార్డులను సమగ్రంగా ఏకీకృతంగా నిర్వహించుటకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఇది ఒకటి అని… భూ సమస్యలను పరిష్కరించడానికి దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో ఈ…
తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన తర్వాత.. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతోంది.. కొన్ని నిమిషాల వ్యవధిలోనే పాస్‌బుక్ కూడా చేతిలో పెట్టేస్తున్నారు అధికారులు.. అయితే, ధరణిలో కొన్ని సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి.. ఇక, వాటి పరిష్కారానికి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి.. దీంతో.. ఆ సమస్యలు త్వరితగతిని పరిష్కరించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది ప్రభుత్వం.. ధరణి కి సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు తాజాగా.. వాట్సాప్, ఈ మెయిల్‌ను…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ పై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ధరణి పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, ప్రతిరోజూ పెండెన్సీ స్థితిని పర్యవేక్షించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. వాట్సాప్, ఈమెయిల్ లతో పాటు అందిన అన్ని ఫిర్యాదులపై స్పందించి,ఆయా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు. భూ…