ఇవాళ జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీ సీతాకాల సమావేశం జరుగనుండటంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు ప్రగతిభవన్ లో ప్రధానంగా ధరణీలో సమస్యల పరిస్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి, ఇతర టీపీసీసీ నేతలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో భూములు, భూరికార్డులు కీలకమైనవని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్‌కు రెండేళ్లు నిండాయి.. ధరణిలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై నేటితో రెండేళ్లు పూర్తవుతుంది.. 2020 నవంబర్ 2న ప్రారంభించిన ధరణి భూ పరిపాలలో ఒక కొత్త అధ్యాయంగా చెప్పాలి.. ధరణికి ముందు రాష్ట్రంలో కేవలం 141 ప్రాంతాల్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగగా.. ధరణి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏకంగా రాష్ట్రంలోని 574 మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. ఇక, రిజిస్ట్రేషన్ల…