కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులోనూ సుపరిచితుడే . అయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని ధనుష్ తాజాగా తన స్ట్రైట్ ఫిల్మ్ ప్రకటించేశాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో చిత్రంతో తన డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు ‘తొలిప్రేమ’ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నవ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.…
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో క్రేజీ ఫ్యాన్స్ లెక్క వేరే లెవెల్ అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ హీరో స్టైల్ కు బాలీవుడ్ కూడా ఫిదా అవుతోంది. ఇప్పటికే తన సినిమా కోసం బిటౌన్ ముద్దుగుమ్మ అనన్య పాండేతో కలిసి నటిస్తున్న ఈ హీరో ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ డాటర్, స్టార్ హీరోయిన్ మనసులో స్థానం సంపాదించుకున్నాడు. బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్…
సినిమా ఇండస్ట్రీలో టైటిల్ విషయంలో మేకర్స్ చాలా సీరియస్ గా ఉంటారు. చాలాసార్లు టైటిల్ గురించి కొంతమంది దర్శకనిర్మాతలు బహిరంగంగానే గొడవ పడడం మనం చూశాము. మరికొంత మంది మాత్రం సర్దుకుపోతుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ‘ఆత్రంగి రే’ విషయంలో డైరెక్టర్ కు షరతు పెట్టాడట. ఈ విషయాన్నీ స్వయంగా ‘అత్రంగి రే’ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ వెల్లడించారు. Read Also : “మనీ హీస్ట్-5” మేకర్స్ కు షాక్……
సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్, ధనుష్ నటించిన ‘ఆత్రంగి రే’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఆత్రంగి రే’ క్రిస్మస్ సందర్భంగా ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీని చాలా ప్రత్యేకంగా చూపించారు. ‘ఆత్రంగి రే’ 3 నిమిషాల 8 సెకన్ల ట్రైలర్ లో సారా అలీ ఖాన్ (రింకు సూర్యవంశీ)ని వివాహం చేసుకున్న ధనుష్ (విషు)ని…
కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఈ యేడాది థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ అభిమానులు ఈ విషయంలో కాస్తంత నిరాశకు గురైనా, ఒకే సమయంలో 190 దేశాలలో 17 భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అయ్యి విడుదల కావడం వారికి కొంత ఓదార్పును కలిగించింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పునరావృతం కాబోతోంది. ధనుష్ నటించిన తాజా హిందీ చిత్రం ‘అత్రంగీ రే’…
యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న…
నటుడిగా రజనీకాంత్ ది నలభై ఆరేళ్ల సుదీర్ఘ ప్రయాణం. చిత్రం ఏమంటే నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఏదీ ఇంతవరకూ దక్కలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారంతోనూ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతోనూ గౌరవించింది. ఇక తాజాగా 2021కి సంబంధించి సినిమా ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్…
ధనుష్ హీరోగా నటించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ‘కర్ణన్’. ఈ ఏడాది ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రంపై ప్రశంసలు ఇంకా ఆగట్లేదు. అలాగే అవార్డులు కూడా రావడం ఆగడం లేదు. ఇప్పటికే పలు అవార్డులను అందుకున్న “కర్ణన్” చిత్రం తాజాగా బెంగుళూరులో జరిగిన ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ భారతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఇది నాలుగో ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎడిషన్. ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్…
ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. చాలా కాలం తర్వాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ధనుష్ విజయంలో కీలక పాత్ర పోషించారు సెల్వరాఘవన్. ‘తుల్లువదో ఇళమై’, ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు ధనుష్ తో ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు.…