తమిళ స్టార్ హీరో ధనుష్ నెక్స్ట్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఆసక్తికరంగా సాగిన ఈ మోషన్ పోస్టర్ లో సినిమాకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ‘సార్’ అంటూ ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించిన టైటిల్ ను రివీల్ చేయగా, దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు.
Read Also :
‘వాతి’ అనే తమిళ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ‘సార్’ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ధనుష్ ప్రస్తుతం తమిళంలో మరో రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రానికి కూడా సంతకం చేశాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.