కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో ధనుష్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్.. తెలుగులో ‘సార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ మధ్యనే షూటింగ్ మొదలుపెట్టింది. ఈసమయంలో ధనుష్ కు కోవిడ్ పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందని మేకర్స్ తెలుపుతున్నారు. అయితే ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లోనే ముగించాలని దర్శకుడు వెంకీ అట్లూరికి ధనుష్ ముందుగానే కండీషన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోవడంతో మేకర్స్ కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమానే ఇంత లేట్ అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇంకెంత లేట్ అవుతుందో చూడాలి మరి. ఏడీఐమైనా ధనుష్ విడాకులు.. తెలుగు దర్శకులకు చిక్కులు తెచ్చిపెట్టినట్లు అవుతోంది అని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.