పూజా కార్యక్రమాలతో ‘సార్’ స్టార్ట్ చేశాడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం, నేపథ్య సంగీతం సమకూర్చనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో ధనుష్ తో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 5 నుంచి ప్రారంభం కానుంది.
Rea Also : ‘ఆర్ఆర్ఆర్’ బాటలో ‘రాధేశ్యామ్’?
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఎడ్యుకేషన్ మాఫియా గురించి చెప్పే పీరియాడికల్ సోషల్ డ్రామాగా ‘సార్’ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఈ మేరకు ఇటీవల విడుదలైన ‘సార్’ మోషన్ పోస్ట్ లో సినిమా టైటిల్ పోస్టర్‌లో భారీ బ్లాక్‌బోర్డ్‌తో పాటు తరగతిలో విద్యార్థులు దానివైపు చూస్తున్నట్టు, అలాగే ధనుష్ పాఠాలు చెబుతున్నట్టు చూపించారు. ఒక కామన్ మ్యాన్ ప్రతిష్టాత్మక జర్నీ అంటూ మేకర్స్ టైటిల్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
తాజావార్తలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!