షాకింగ్.. విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో ధనుష్-ఐశ్వర్య దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విడాకులు తీసుకుంటున్న జాబితాలో మరో ప్రముఖ జంట చేరింది. తమిళ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 2004లో వీరి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరి విడాకులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గత 18 ఏళ్ల నుంచి స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా ఒకరినొకరం అర్థం చేసుకుని ప్రయాణం కొనసాగించామని… కానీ ఇప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యామని హీరో ధనుష్ ఓ లేఖ ద్వారా వివరించాడు.
Read Also: మహేష్ చెల్లిగా సాయి పల్లవి..?
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
వ్యక్తిగతంగా తాను, ఐశ్వర్య సమయం తీసుకోవాలని భావించామని… తమ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత గోప్యత అవసరమని ధనుష్ విజ్ఞప్తి చేశాడు. కాగా హీరో ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శక, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు. ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌కు సోదరుడు. అటు ఐశ్వర్య రజనీకాంత్ పలు సినిమాలకు దర్శకత్వం వహించింది. ధనుష్ హీరోగా ‘3’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది. ఈ మూవీలోని వై దిస్ కొలవెరి సాంగ్ ఎంతో పాపులర్ అయ్యింది. అయితే ధనుష్-ఐశ్వర్య మధ్య కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం సంచలనం సృష్టించిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచే ధనుష్-ఐశ్వర్య దంపతుల మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
OM NAMASHIVAAYA 🙏🙏🙏 pic.twitter.com/XXFo8BDRIO
— Dhanush (@dhanushkraja) March 23, 2021
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!