హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.…
ఈ యేడాది ఏప్రిల్ లో విడుదలైన ‘కర్ణన్’ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ సైతం పొందింది. ధనుష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కలైపులి ఎస్. థాను నిర్మించారు. ఈ సినిమా ‘న్యూ జనరేషన్స్ – ఇండిపెండెంట్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాంక్ఫర్ట్’కు ఎంపికైంది. నవంబర్ 12, 13, 14 తేదీలలో ఈ చిత్రోత్సవం జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో జరుగబోతోంది. ప్రస్తుతం ‘కర్ణన్’ మూవీ అమెజాన్ ప్రైమ్…
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో…
తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “బీస్ట్”. ఈ మూవీలో మరో కోలీవుడ్ హీరో ధనుష్ కూడా భాగం కాబోతున్నాడట. ఇదే విషయంపై ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో భాగం కావడం అనే వార్త అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా ధనుష్ గురించి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్…
“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్…
ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కర్ణన్’ మూవీ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ అయితే, జూన్ 18న ‘జగమే తంత్రం’ ఓటీటీ ద్వారా జనం ముందుకొచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. హిందీ సినిమా ‘అత్రంగి రే’, తమిళ చిత్రాలు ‘నానే వరువెన్’, ‘ఆయిరిత్తల్ ఒరువన్ -2’తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయడానికీ ధనుష్ కమిట్ అయ్యాడు. Read…
ఇప్పటికే మన స్టార్ హీరోలకు కావాల్సినన్ని కార్లు గ్యారేజ్ లో వున్నా, మార్కెట్ లో మరో మోడల్స్ మన హీరోలకు నచ్చితే వారి గ్యారేజ్ లో చేరాల్సిందే.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోజు పడి తీసుకున్న కారు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక ఆ కారు ఫీచర్లు కూడా అదరగొట్టేశాయి. ‘లాంబోర్గిన ఉరస్ గ్రాఫిటే క్యాప్సుల్’ మోడల్ కారు ఇప్పుడు కేవలం ఎన్టీఆర్ దగ్గర మాత్రమే వుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు ,…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ పుట్టినరోజు. ఆ రోజు మహేశ్ నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ కు సంబంధించి స్పెషల్ అప్ డేట్ తో పాటు ట్విటర్ స్పేసెస్ లో స్పెషల్ ఆడియో లైవ్ సెషన్ ప్లాన్ చేస్తోంది మహేశ్ అండ్ టీమ్. ఈ ట్విటర్ స్పేసెస్ ఫీచర్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రముఖు పుట్టిరోజుతో పాటు పలు సెలబ్రేషన్స్ టైమ్ లో ట్విటర్ స్పేసెస్ ఆడియో సెసెన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. మనదేశంలో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటిషన్ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య…