తెలంగాణలో సంచలనం కలిగించిన బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి ,నిజామాబాద్ కమీషనర్ కే ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారు అని డీజీపీ మహేందర్ రెడ్డి హోం మంత్రికి వివరించారు. ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరాతీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మెడికల్ లీవ్‌లోకి వెళ్తున్నారు.. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు మెడికల్ లీవ్‌లో ఉండనున్నారు మహేందర్ రెడ్డి.. ఎడమ భుజానికి స్వల్ప గాయం, శస్త్రచికిత్స కారణంగా మెడికల్ లీవ్‌లోకి వెళ్లారు తెలంగాణ పోలీస్ బాస్.. దీంతో మహేందర్ రెడ్డి స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అంజనీ కుమార్ ఈమధ్యే బదిలీ అయ్యారు.. ఆయనను ఏసీబీ డీజీగా…
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 37…
ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మై హోమ్…
డ్రగ్స్ వ్యవహారంపై మళ్లీ ఫోకస్ పెట్టారు తెలంగాణ పోలీసులు.. ఇవాళ డ్రగ్స్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి జంట నగరాల పోలీస్ కమిషనర్లతో పాటు జిల్లా ఎస్పీలు హాజరయ్యారు.. డ్రగ్స్ నియంత్రణకు 1000 మందితో ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే కాగా.. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు డీజీపీ.. ఇక, సీఎంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో హై లెవల్…
ఉన్నత విద్యామండలి కార్యాలయంలో తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో డీజీపీ మహేందర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వెరిఫికేషన్ సర్వీసెస్‌పై ప్రత్యేకంగా చర్చ జరిగింది. నకిలీ సర్టిఫికెట్లను చెక్ చేయడంపై అధికారులు సమీక్షించారు. విద్యార్థుల డేటా వెరిఫికేషన్‌పై మేధో మదన సమావేశం నిర్వహించామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సాధికారికంగా, సులభంగా, అథెంటిక్‌గా ఉండాలని భావిస్తున్నామని… ఫేక్…
సెక్రటేరియట్ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు కేసీఆర్. నిర్మాణ పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమౌతున్న రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై సీఎం కేసీఆర్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల…
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన…
2021 ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కోవిడ్ సమయంలో ప్రజలతో పాటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేశారన్నారు. తెలంగాణలో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కుదిరిందని,ఈ సంవత్సరం మొత్తం ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని ఆయన అన్నారు. మావోయిస్ట్ సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సక్సెస్ అయ్యిందని, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు పోలీస్ శాఖ…
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.. న్యూ ఇయర్ నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.. కోవిడ్, నియంత్రణలో భాగంగా ర్యాలీలు, సభలు జనవరి 2వ తేదీ వరకు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్న ఆయన.. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు స్పష్టం చేశారు. ఇక, వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు…