ప్రజల కోసమే పోలీసులు :హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీస్ ముందు స్థాయిలో ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కితాబు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పెద్ద షాపూర్ వద్ద నూతనంగా నిర్మించిన అత్యాధునిక పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి, జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి కృషితో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ నడుం బిగించిందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా 7వందల కోట్ల రూపాయలను కేటాయించారని, 28 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఎప్పుడు లేని విధంగా 33 శాతం మహిళా సిబ్బంది పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also Read
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల సిసి కెమెరాల ద్వారా నిత్యం శాంతిభద్రతల పర్యవేక్షణ ఉంటుందని, 26 జిల్లా పోలీసు కార్యాలయం అత్యద్భుతంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిద్దిపేటలో అత్యాధునిక కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, సైబర్ నేరాలను అరికడుతున్నట్టు తెలిపారు. లండన్, అమెరికాకు ఏ మాత్రం తీసిపోకుండా నాణ్యమైన సేవలు నిర్వహిస్తున్నామని వివరించారు. రౌడీయిజాన్ని కంట్రోల్ లో పెట్టి అవసరమైతే పిడి యాక్టులు నమోదు చేశామని తెలిపారు. శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ భవనం, సిబ్బందికి క్వార్టర్స్ కూడా త్వరలో నిర్మించేందుకు ప్రణాళికలు చేపడతామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే పాస్ పోర్టులు లభిస్తున్నాయని తెలిపారు. జెపి దర్గా వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు అవుతుందని తెలిపారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!