DGP Mahender Reddy : మేడారం జాతరకు భారీగా భద్రతా ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 37 చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు, ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీసు అవుట్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లతో పాటు జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అధునాతన రీతిలో భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. అయితే తెలంగాణ కుంభమేళగా భావించే మేడారం జాతరకు కోట్లాదిమంది ప్రజలు విశేషంగా తరలివస్తారు. రోడ్డు మార్గం ద్వారా మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ట్రాఫిక్ లో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా, హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే 13వ తేదీ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!