ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు తన పదవీ విరమణ ఫేర్వెల్ పరేడ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.. నా జీవితంలో ఇవి ఉద్విగ్నభరిత క్షణాలు.. సర్వీసులో ఉన్నపుడు చేసిన పనులు నా జ్ఞాపకాలు.. దశాబ్దాలుగా నన్ను అంటిపెట్టుకుని ఉన్న యూనిఫాం ఇకపై ఉండదు అనేది ఎమోషన్‌గా అనిపించిందని పేర్కొన్నారు.. ఇన్నాళ్ల పాటు సర్వీసులో ఉన్న నాకు అనేక మంది సహకరించారు.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సవాళ్లను చూశాను అన్నారు..
తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు..
నరసరావుపేటలో డీజీపీ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. జిల్లా కేంద్రం నరసరావుపేటలో నూతనంగా నిర్మించిన డాగ్ స్వాడ్, జిల్లా పెరేడ్ గ్రౌండ్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.
పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు..
AP DGP: రాష్ట్రంలో సైబర్ క్రైమ్ 34 శాతం పెరిగింది.. గంజా కేసులు 3 శాతం పెరిగాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు. 97,760 గత సంవత్సరం రిపోర్ట్ అయిన క్రైమ్స్.. ఈ సంవత్సరం 92,094 క్రైం రిపోర్ట్ అయ్యాయి.. ఓవరాల్ క్రైం రేటు 5.2 శాతం తగ్గిందన్నారు. ఇ
అనంతపురం పర్యటనలో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు.. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ ఇదే మా విధానం అన్నారు డీజీపీ.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం.. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయబోమని స్పష్టం చేశారు.. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నేను కామెంట్ చేయను అంటూ దాటవేశారు.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసు నైనా విచారిస్తాం అన్నారు ఏపీ డీజీపీ..
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ.. రెండూ ఉండాలి అంటూ డ్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీలకు సూచించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ఇదే సమయంలో.. శాంతి భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో దూకుడు తగ్గించింది సిట్.. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్‌కు సిట్ పరిమితంకానుంది.. అయితే, గత మూడు రోజుల్లో కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు.. ఇక, తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. 3వ తేదీ వరకు సిట్ విచారణ నిలిపివేశామని ప్రకటించారు..
ఈరోజు జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐపీఎస్ సమీక్షించారు.