AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. వెయిటింగ్‌లో ఉంటూ హెడ్ క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండని సీనియర్ ఐపీఎస్‌లకు మెమోలు జారీ చేశారు.. ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు డీజీపీ.
వెలగపూడిలోని సెక్రటేరియట్‌లో కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ఈ కాన్ఫరెన్స్ పలు శాఖలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీ ద్వారకా తిరుమల రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గంజాయి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.