Anonymous Devotee Offers 121 Kg Gold to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం కోట్ల రూపాయలు విరాళంగా అందుతాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపారవేత్త శ్రీవారికి కళ్లు చెదిరే విరాళంను అందజేశారు. ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4…
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో ఓ ఖరీదైన వజ్రం లభించింది. దేవాదాయ శాఖ ఆధికారులు గురువారం హుండీ లెక్కింపును చేపట్టగా.. అందులో వజ్రాన్ని గుర్తించారు. ఆ వజ్రం 1.39.6 క్యారెట్లు ఉన్నట్లు ఆధికారులు తేల్చారు. ఓ అజ్ఞాత భక్తుడు వజ్రంను ఆంజనేయ స్వామి ఆలయ హుండీలో వేసినట్లు దేవాదాయ శాఖ ఆధికారులు తెలిపారు. తమకు హుండీలో వజ్రం, టెస్టింగ్ కార్డుతో పాటు ఓ లేఖ కూడా దొరికిందని చెప్పారు. ‘నాకు వజ్రం…
ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఖరీదైన వజ్రాల కిరీటం అందజేశారు ముంబైకి చెందిన సౌరభ్.. అలాగే సీఎం రమేష్ అనే భక్తుడు సూర్యచంద్రులను, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భక్తురాలు హైమవతి సూర్యకుమారి బొట్టును అందజేశారు.. మొత్రం అభరణాలు వజ్రాలు పొదిగినవే.. 2 కోట్ల విలువైన కిరీటం దసరా నవరాత్రులలో ప్రత్యేకం కానుంది.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం కోసం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనానికి కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఓ భక్తుడు కలకలం సృష్టించారు… తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య ఒత్తిడితో మొత్తానికి మందు మానేయలనే నిర్ణయానికి వచ్చాడు.. కాణిపాకంలో గణపతి సాక్షిగా మందు మానేయాలని భావించిన ఆయన.. ఇదే మందు తాగడం చివరి సారి అనుకున్నాడో ఏమో.. కానీ, ఫుల్ట్‌గా మందు కొట్టి వచ్చాడు.. దేవుడు దగ్గర మద్యం మానేయటం కోసం వచ్చిన ఆ భక్తుడు… భార్య కోరిక మేరకు మద్యం మానేస్తానంటూ ప్రమానం చేసేందుకు సిద్ధం అయ్యారు..…
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలికి అక్షింతలు వేసింది కన్స్యూమర్ కోర్టు… దర్శనం కేటాయింపు చేయనందుకు పరిహారంగా సంబంధిత భక్తుడికి రూ. 50 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు… అయితే, తమిళనాడు రాష్టం సేలంకు చెందిన హరి భాస్కర్ అనే భక్తుడు… మేల్ చాట్ వస్త్రం సేవ కోసం 2006లో టీటీడీకి రూ.12,250 చెల్లించారు.. కానీ, ఇప్పటి వరకు దర్శనం కల్పించలేదు టీటీడీ.. 17 సంవత్సరాలుగా పలుమార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు హరి…