Tirumala: శ్రీవారికి 121 కేజీల బంగారం విరాళం.. ఆజ్ఞాత భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం!
- తిరుమల శ్రీవారికి కళ్లు చెదిరే విరాళం
- ఏకంగా 121 కేజీల బంగారం విరాళం
- బంగారం విలువ రూ.140-150 కోట్లు
- భక్తుడి కండిషన్ ఏంటో చెప్పిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anonymous Devotee Offers 121 Kg Gold to TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యం కోట్ల రూపాయలు విరాళంగా అందుతాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలు పెద్ద మొత్తంలో తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపారవేత్త శ్రీవారికి కళ్లు చెదిరే విరాళంను అందజేశారు. ఏకంగా 121 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు. మంగళగిరిలో మంగళవారం జరిగిన P4 కార్యక్రమం లాంచింగ్ ఈవెంట్‌లో సీఎం మాట్లాడుతూ అజ్ఞాత భక్తుడి భారీ విరాళం గురించి వెల్లడించారు. ఆ బంగారం విలువ రూ.140-150 కోట్లు ఉంటుంది.
‘ఓ వ్యక్తి కంపెనీ పెట్టాలనుకున్నాడు. అతడు శ్రీవారికి భక్తుడు. అనుకున్నట్లుగానే కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే సక్సెస్ అయ్యాడు. అతను కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మాడు. 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ డాలర్లు (సుమారుగా 6-7 వేల కోట్లు) వచ్చాయి. శ్రీవారి దయ వల్ల తనకు ఇంత డబ్బు వచ్చిందని, తన వంతుగా స్వామి వారికి ఏదైనా విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకోవాలనుకున్నాడు. 121 కేజీల బంగారంను స్వామి వారికి విరాళంగా ఇచ్చాడు. అయితే తన పేరు మాత్రం చెప్పొద్దని లెటర్ రాశాడు. 121 కేజీలే ఎందుకు అని అడిగా. తాను తెలుసుకున్నానని, శ్రీవారికి నిత్యం చేసే పూజల్లో 120 కేజీల బంగారాన్ని ఉపయోగిస్తారని చెప్పాడు. ఓ భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇస్తున్నదంటే అది అతడి గొప్పతనం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వస్తూంటారు. శ్రీవారి ఆశీస్సులతో పైకి ఎదిగామని భావించే భక్తులు తమ సంపాదనలో కొంత విరాళంగా అందిస్తారు. చాలా మంది కొన్ని కోట్లు విరాళం ఇస్తూంటారు. కొంత మంది 4-5 కేజీల ఆభరణాలు విరాళం ఇస్తుంటారు. మరికొంతమంది తమ కంపెనీల్లో తయారు చేసే బస్సులు, లారీలను ఇస్తారు. అయితే అజ్ఞాత భక్తుడు ఒకేసారి 150 కోట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. ‘అంబానీకి కంటే గ్రేట్ సర్’ మీరు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఓ భక్తుడు 121కిలోల బంగారాన్ని తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తున్నారు… పేరు బయటకు చెప్పొద్దని కోరాడు.#P4Model#Margadarsi_BangaruKutumbam#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/zGxFTTjPNK
— CBN Era (@CBN_Era) August 19, 2025
తాజావార్తలు
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!