మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. రెండున్నర దశాబ్దాలు టీడీపీలో పనిచేసిన ఉమ.. కొద్ది రోజుల తర్వాతైనా పార్టీ లైన్ లోకి వస్తారని భావిస్తున్నాను.. ఉమ పార్టీ కార్యక్రమాలు చేస్తే స్వాగతిస్తాం అన్నారు. అయితే, నా టార్గెట్ గా ఉమ పని చేస్తే తగిన సమయంలో సమాధానం చెబుతాను అంటూ వార్నింగ్ ఇచ్చారు
మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్‌లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ కుప్పం పర్యటనపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఎన్నికల స్టంట్లో భాగమే కుప్పంలో జగన్ రెడ్డి తిప్పలు అని ఆరోపించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ 87 శాతం పూర్తి చేస్తే.. మిగిలిన 13 శాతం పనులు చేయడానికి జగన్ రెడ్డికి 57 నెలలు సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. 3 లిఫ్టుల్లో 2 లిఫ్టులు టీడీపీ హయాంలో పూర్తి చేయగా, మిగిలిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి…
కృష్ణా జిల్లాలో కాక రేపుతున్నాయి తాజా రాజకీయ పరిణామాలు.. మైలవరం, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్లా తెలుగుదేశం పార్టీ సర్వేలు చేపట్టింది.. రెండు చోట్లా టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణప్రసాద్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్లతో సర్వే నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
కేశినేని నాని వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అనంతరం.. విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. కాగా.. కేశినేని రాజీనామా అంశంపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. కేవలం ఎంపీ పదవి కోసం…
మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. 'అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటే ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతోంది' అన్నట్లుగా దేవినేని ఉమా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.