BJP: రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ముంబై నగర భద్రత కోసం ఒక ‘‘ఖాన్’’ నగర మేయర్ కాకూడదని ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి బీజేపీ ముంబై చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్ హాజరైన బీజేపీ విజయ్ సంకల్ప్ మేళావాలో అమీత్ సతం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ముంబై సురక్షితంగా ఉంచడమే యుద్ధం. విదేశీ చొరబాట్లు పెరుగుతున్నాయి. వారు తమ రంగును మారుస్తున్నారు. కొన్ని నగరాల మేయర్ల ఇంటిపేర్లు చూడండి.…
Imtiaz Jaleel: ఛత్రపతి సంభాజీనగర్ (మహారాష్ట్ర)లో మాంసం దుకాణాలను పండుగల సందర్భంలో మూసివేయాలన్న స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ ఆదేశాలకు వ్యతిరేకంగా AIMIM నేత, మాజీ ఎంపీ ఇమ్తియాజ్ జలీల్ శుక్రవారం తన నివాసంలో ‘బిర్యానీ పార్టీ’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. మాంసం నిషేధంపై మునిసిపల్ కమిషనర్ ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకోలేదని ఆయన నిలదీశారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), కృష్ణష్టామి సందర్బంగా చత్రపతి సంభాజీనగర్ మునిసిపల్ కార్పొరేషన్…
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇచ్చిన విందులో ఉద్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య థాక్రేకు అవమానం జరిగిందంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆరోపించారు.
Shiv Sena MLA: ముంబైలో హాస్టల్ క్యాంటీన్‌లో నాసిరకం భోజనం పెట్టారని శివసేన (షిండే) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ క్యాంటిన్ సిబ్బందిపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఇవాళ (గురువారం) దక్షిణ భారతీయులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో…
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Maharashtra: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర చవాన్ మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం వెల్లడించారు. ఈ విషయమై ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశీలకుడిగా కిరణ్ రిజిజూ హాజరైనట్లు ఆయన వెల్లడించారు. రవీంద్ర చవాన్ నామినేషన్ దాఖలు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి…
Maharashtra: మహారాష్ట్రలో ప్రతిపక్షాలు ‘‘హిందీ విధింపు’’ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం త్రిభాషా విధానంపై సవరించిన ప్రభుత్వ తీర్మానాన్ని (GR) రద్దు చేసింది. విధానాన్ని సమీక్షించి, కొత్తగా అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్ గాంధీని ప్రజలు తిరస్కరించినప్పటికి నుంచి ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియను పదే పదే అవమానిస్తున్నారు’’ అని ఆరోపించారు.