మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. గౌహతి నుంచే రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయం నడుపుతున్నారు.. మరోవైపు అధికారం ఛేజారకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్లాన్‌లో ఉద్దశ్ థాక్రే శిబిరం ఉంది.. వారికి సీనియర్ పొలిటీషియన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సలహాలు ఇస్తున్నారట.. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.. దీని కోసం ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు…
మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు వర్గం, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గౌహతి నుంచి శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి గుజరాత్ వడోదర వేదిక అయినట్లు వార్తలు వినిపిస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాట్ల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఈ భేటీ జరిగినట్లు సంబంధిత వర్గాల నుంచి…
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్‌లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న…
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్న వీస్ తన పరువునష్టం కలిగించేలా ట్వీట్లు చేసినందుకు మహా రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్‌కు పరువు నష్టం దావా నోటీసలు పంపారు. డ్రగ్ పెడ్లర్ జయదీప్ రనడేతో అమృతకు సంబంధాలు ఉన్నాయని మాలిక్ గతంలో పేర్కొన్నాడు. 48 గంట ల్లోగా ట్వీట్లను తొలగించి, బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పా లని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అమృత గురు వారం నవాబ్ మాలిక్‌ను…
మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. రాజకీయాల్లో ఎవరికి ఎవరూ శతృవులు కాదు, ఎవరూ శాశ్వత మిత్రులూ కాదు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఫైట్ చేసిన శివసేన పార్టీ అధికారం కోసం బీజేపీతో తెగతెంపులు చేసుకొని కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. బీజేపీకి వ్యతిరేకంగా శివసేన బయటకురావడంతో మరోమాట మాట్లాడకుండా ఉద్ధవ్‌కు జైకొట్టింది కాంగ్రెస్. అయితే, గత కొన్ని రోజులుగా మహా అఘాడి వికాస్‌లో భాగస్వామ్యంగా ఉన్న ఎస్సీపీ…