Maharashtra Political Crisis: హుటాహుటిన హస్తినకు ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. గౌహతి నుంచే రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయం నడుపుతున్నారు.. మరోవైపు అధికారం ఛేజారకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్లాన్‌లో ఉద్దశ్ థాక్రే శిబిరం ఉంది.. వారికి సీనియర్ పొలిటీషియన్, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సలహాలు ఇస్తున్నారట.. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.. దీని కోసం ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.. అందులో భాగంగా మహారాష్ట్రలో కీలక నేత అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో, హుటాహుటిన హస్తినబాట పట్టారు ఫడ్నవీస్.. బీజేపీ పెద్దలతో భేటీకానున్న ఆయన.. మహారాష్ట్రలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.. ఎలా అయితే, అధికారంలోకి వస్తాం..? ఇంకా ఎలా ముందుకు వెళ్లాలి..? రెబల్ ఎమ్మెల్యేలను నమ్ముకుని రాజకీయం చేయొచ్చా..? అనే అన్ని కోణాల్లో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది..
Read Also: Hyderabad Party: మితిమీరుతున్న పార్టీలు.. దీనికి ఆర్గనైజర్ మహిళే!
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఢిల్లీ వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు, గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, ఏక్‌నాథ్ షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇక, శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తేనే.. ముంబై తిరిగి వస్తామని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భగత్‌సింగ్ కొష్యారి లేఖ రాశారు. ఈ మధ్య విడుదల చేసిన నిధులు, జీవోలపై వివరాలు అందజేయాలని లేఖలో కోరారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!