Maharashtra: ఒకే లిఫ్ట్‌లో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ‘‘సీక్రెట్ మీటింగ్’’..
- ఒకే లిఫ్టులో ఫడ్నవీస్
- ఠాక్రే..
- మహారాష్ట్ర అసెంబ్లీలో ఘటన..
- ఏం మాట్లాడుకున్నారో అనే చర్చ..
- వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సమయంలో ఒకేసారి ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అనుకోకుండా కలిశారు. అసెంబ్లీలో లిఫ్టు కోసం ఇద్దరు నేతలు ఎదురుచూస్తు్న్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇద్దరు పరస్పరం కొంతసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం గురించి ఉద్ధవ్ ఠాక్రేని ప్రశ్నించిన సందర్భంలో.. ‘‘ఇప్పటి నుంచి రహస్య సమావేశాలన్ని లిఫ్టులోనే చేస్తాం’’ అని సరదాగా అన్నారు.
ఫడ్నవీస్‌తో తాను లిఫ్టులో ఉన్నప్పుడు ప్రజలు ‘‘ నానా కర్తే ప్యార్ తుమ్హీ సే కర్ బైతే’’((1965 చిత్రం జబ్ జబ్ ఫూల్ ఖిలే సాంగ్, దీని అర్థం నన్ను ద్వేషించినా నిన్ను ప్రేమిస్తున్నాను) అని అనుకున్నారని, అయితే అలాంటిదేం లేదని, ఇది ఊహించని సమావేశం అని ఠాక్రే చెప్పారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
Read Also: Pensions Distribution: కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు
బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్‌తో, ఠాక్రే మధ్య సంభాషణకు సంబంధించిన చిత్రాలు వెలువడ్డాయి. బీజేపీ నేత ఠాక్రేకి చాక్లెట్ బార్ ఇచ్చినప్పుడు, ‘‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’’ అని ఠాక్రే బదులిచ్చారు. ఎన్నికల ముందు మహారాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకునేందుకు బడ్జెట్ రూపొందిస్తున్నారని శివసేన యూబీటీ నేత ఠాక్రే చెప్పారు.
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఇదే చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి ఘోరంగా దెబ్బతింది. రాష్ట్రంలోని 48 ఎంపీ స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్ పవార్) కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి.
తాజావార్తలు
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!