Maharashtra: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ నినాదం బీజేపీ కూటమిలో కూడా చిచ్చురేపుతోంది. బీజేపీ మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించాడు. ఇది జార్ఖండ్, యూపీ ప్రాంతాల్లో పనిచేస్తుందని కానీ, మహారాష్ట్రలో నినాదం పనిచేయదంటూ ఇటీవల వ్యాఖ్యానించారు.
Maharashtra : నవంబర్ 20న జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విచిత్రంగా ఉన్నాయని, నవంబర్ 23న ఫలితాలు వెలువడిన తర్వాతే ఏ గ్రూపుకు మద్దతిస్తుందో తేలిపోతుందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు బరిలో నిలుచున్నదెవరో తేలిపోయింది. ఇక ప్రచార రంగంలోకి అభ్యర్థులు దిగనున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇదిలా ఉంటే మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర చర్చ జరుగుతోంది
మహారాష్ట్ర ఎన్నికల వేళ హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న రవి రాజా.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. హస్తానికి బై బై చెప్పి కమలం గూటికి చేరారు. దీపావళి పండుగను పురస్కరించుకుని గురువారం డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో రవి రాజా బీజేపీలో చేరారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
Devendra Fadnavis: రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో ‘‘ఓట్ జిహాద్’’, నకిలీ కథనాలు పని చేయలేయవని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్డీటీవీతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేవారు. నవంబర్ 20 ఎన్నికల తర్వాత మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఈ రోజు ధీమా వ్యక్తం చేశారు.
Maharashtra Assembly Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు వారి కోరిక మేరకు సీట్లు ఇవ్వడం ద్వారా బీజేపీ వచ్చేసారి అధికారంలోకి వస్తే అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేసింది.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. 99 మందితో తొలి లిస్ట్‌ని విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులోనే డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు అశోక్ చవాన్ కూతురి పేర్లు ఉన్నాయి. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Maharastra : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, డిప్యూటీ సీఎం, సీనియర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయం వెలుపల ఒక గుర్తు తెలియని మహిళ హంగామా సృష్టించింది..