Devendra Fadnavis: ఛత్రపతి మాకు స్పూర్తి, పారిపోయే ప్రసక్తే లేదు.. రాజీనామాపై వెనక్కి తగ్గిన ఫడ్నవీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ దారుణ ప్రదర్శనకు తాను బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల చెప్పారు. అయితే, అమిత్ షాతో పాటు ఇతర బీజేపీ అగ్రనాయకత్వం వారించడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తాను పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయాలని అమిత్ షా కోరిన ఒక రోజు తర్వాత ఆయన నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 ఎంపీ సీట్లలో బీజేపీ 23 గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో కేవలం 09 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘‘నేను అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తున్నాను, ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ పేరు మార్మోగుతోంది, నిన్న, NDA ప్రధానమంత్రిగా ఆయన పేరును అంగీకరించింది, ఈ సారి మహారాష్ట్రలో మేము కోరుకున్నన్ని సీట్లు పొందలేదు. భవిష్యత్ వ్యూహాలను రూపొందిస్తున్నాము’’ అని ఆయన అన్నారు.
Also Read
Read Also: Canada: ఇందిరా గాంధీ హత్యపై పోస్టర్లు.. ఖలిస్తానీల దురాగతం..
రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గత కారణాలను వివరిస్తూ ఫడ్నవీస్ ‘‘ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నేను నాయకత్వం వహించాను, కాబట్టి ఈ ఓటమికి నేనే బాధ్యత వహించాను. నా పదవికి రాజీనామా చేయడానికి అనుమతించాలని కోరాను. దీని వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో అట్టడుగు స్థాయిలో పనిచేయవచ్చని అనుకున్నాను. అయితే అగ్రనాయకత్వం తనపై నమ్మకం ఉంచింది. నాకు ఓ వ్యూహం ఉంది. తాను పారిపోయే వాడిని కాదు. కొందరు తాను నిరాశ చెందానని అనుకున్నారు. మనకు ఛత్రపతి శివాజీ స్పూర్తి. నేను ఎలాంటి భావోద్వేగ నిర్ణయం తీసుకోను. నా మెదడులో ఓ వ్యూహం ఉంది’’ అని అన్నారు.
మహారాష్ట్ర లోక్‌సభ ఫలితాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 48 స్థానాల్లో కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్దశ్ శివసేన 30 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక బీజేపీ కూటమిలోని బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, షిండే శివసేన కలిసి 17 సీట్లను గెలుచుకున్నాయి. అయితే, ప్రతిపక్ష కూటమి తమ కన్నా 2 లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పొందాయని, కానీ సీట్లు భారీగా కోల్పోయామని అన్నారు. దళితులు, గిరిజనులను మభ్యపెట్టేలా కాంగ్రెస్ కూటమి ఓ కథనాన్ని రూపొందించిందని, వచ్చే ఎన్నికల్లో అది నడవదని చెప్పారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!