Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్…
ఓట్లు, సీట్లు కారణంగానే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ…
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
యువత వారానికి 70 గంటలు పని చేయాలని తాను చేసిన ప్రకటనను ఐటీ రంగ ప్రముఖుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించారు. కృషి మాత్రమే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందన్నారు. సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆయన ఈ వారానికి 70 గంటల పని గురించి మరోసారి ప్రస్తావించారు. "క్షమించండి, నా అభిప్రాయం మారలేదు. నేను చనిపోయే వరకు ఈ ఆలోచన నాలో ఉంటుంది." అని ఆయన స్పష్టం చేశారు. 1986లో…
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి ఆరు నూతన పాలసీలు రూపొందించామని.. ఈ నూతన పాలసీలతో ఒక గేమ్ ఛేంజర్‌గా ఏపీ అభివృద్ధి మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం 4.0, ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0, ఏపీ గ్రీన్ ఎనర్జీ 4.0, టూరిజం, ఐటీ విధానాలలో పాటు అనేక కొత్త పాలసీలు తీసుకొచ్చారు.
CAG on Viksit Bharat: భారతదేశంలోని గ్రామాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడం అసాధ్యం అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీశ్ చంద్ర ముర్ము తెలిపారు.
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.