ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నాం. ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వైయస్ఆర్ చేయూత ద్వారా 45-60 ఏళ్ల మహిళలకు రూ.9,100 కోట్లు అందించామని…
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా…
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ హోరా హోరీ ప్రచారం చేస్తున్నాయి. గులాబీ పార్టీ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. పోలింగ్ నాటికి నియోజకవర్గంలోని ప్రతి ఇంటి తలుపుతట్టాలని టీఆర్‌ఎస్ కార్యకర్తలను హైకమాండ్ ఆదేశించింది. ఇటు అధికార టీఆర్‌ఎస్..అటు సిట్టింగ్ ఎమ్మెల్యే , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఈ ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే ప్రజలు ఈ హై ఓల్టేజీ ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నారు. విజయం ఎవరికి..? అభివృద్ధి…
కామారెడ్డి జిల్లా.. బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో మాట్లాడుతూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం లో ఎక్కడ లేని అభివృద్ధి తెలంగాణలోనే ఉంది. కానీ ఆ అభివృద్ధి చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి వేరే రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని అడిగారు. అలా నిరూపిస్తే ఉంటే రాజీనామా చేస్తా అన్నారు. మేము ప్రజలనే నమ్ముకున్నాం , ఓడించాలన్నా గెలిపించాలన్నా ప్రజలతోనే సాధ్యం అవుతుంది. గెలుపు ఓటముల గురించి…
ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్‌లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్‌కు డెవలప్‌మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.. ఈ విషయాన్ని జర్మన్ డెవలప్‌మెంట్ మంత్రి గెర్డ్ ముల్లర్ రినిష్ వెల్లడించారు.. డెవలప్‌మెంట్ ఫండ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్న ఆయన.. ఇదే సమయంలో.. అక్కడినుంచి వచ్చేయాలని భావిస్తున్న స్థానిక అభివృద్ధి అధికారులు, ఎన్‌జీవోలకు చెందిన సభ్యులను దేశానికి రప్పించే చర్యలు మాత్రం కొనసాగిస్తామని తెలిపారు. అయితే, ఏడాదికి 430…
అత్యధిక వేతనం తీసుకుంటున్నారంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తన సొంతూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తనకు ప్రతీ నెలా రూ.5 లక్షల గౌరవవేతనం వస్తే.. అందులో రూ.2.75 లక్షలు ట్యాక్సులకే పోతుందన్నారు.. నెలలో తాను ఆదా చేసుకున్న దాని కన్నా ఎక్కువే కొందరు సంపాదిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇక, ప్రజలంతా కర్తవ్యదీక్షతో పన్నులు చెల్లించాలన్నారు. రాష్ట్రపతి కోవింద్ తాను ట్యాక్స్ కడుతున్నట్లు…