Ram Mohan Naidu: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లే సాధ్యం..
- శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం
- ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు రావడం ఆనందంగా ఉంది- రామ్మోహన్ నాయుడు
- గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే స్థానికులు భయపడే వారు- రామ్మోహన్ నాయుడు
- ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు.. మోడీ వల్లనే సాధ్యం అవుతుంది- రామ్మోహన్ నాయుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. సూపర్ సిక్స్‌లో భాగంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. గత పాలనలో ఇచ్ఛాపురంలో తిరగాలంటే భయం భయంగా స్థానికులు ఉండేవారు.. ఇప్పుడు అందరూ చిరునవ్వుతో ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చంద్రబాబు, మోడీ వల్లనే సాధ్యం అవుతుందని అన్నారు. అధికారంలో రాగానే పింఛన్లు మూడు నెలలు బకాయి ఒకేసారి ఇచ్చి హామీ నెరవేర్చుకున్నాం.. సూపర్ సిక్స్‌లో ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఉద్దాన సమస్యలను త్వరలో పరిష్కరిస్తుంది.. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ముఖ్యమంత్రి చెప్పారు.. దానిపై కార్యాచరణ రూపొందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Read Also: RBI Repo Rate: రెపో రేటును 25 పాయింట్లు తగ్గించనున్న ఆర్‌బీఐ?
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ ఇచ్ఛాపురం నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 2019లో దుర్మార్గుల పాలన 5 సంవత్సరాలు జరిగింది.. సచివాలయం కూడా తనఖా పెట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు. ప్రజల కోసం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంటే కొంతమంది దీన్ని వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాలేదు.. ఇప్పుడిప్పుడే రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం.. ఇచ్చిన ప్రతి హామీని తమ నాయకుడు చంద్రబాబు నెరవేరుస్తారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Vangalapudi Anitha: అధికారుల్లో ఇంకా పాత వాసన ఉంది.. హోంమంత్రి సీరియస్
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!