హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏఎం రత్నం మాట్లాడుతూ, “నేను ఎన్నో సినిమాలు నిర్మించాను కానీ ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. Also Read : HHVM : నైజాం ఫాన్స్ గెట్ రెడీ.. ప్రీమియర్స్ కి పర్మిషన్ వచ్చేసింది ! అంతేకాదు, ఖుషీ లాంటి సినిమా కాకుండా…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామస్థులందరికీ చెప్పులు పంపిణీ చేశారు. ఇటీవల "అడవితల్లి బాట" అనే కార్యక్రమంలో భాగంగా పవన్ ఆదివాసీ గ్రామం పెదపాడులో పర్యటించిన విషయం విదితమే. ఆ సమయంలో పాంగి మిథు అనే వృద్ధురాలు పవన్‌కళ్యాణ్ కోసం నడిచి వచ్చి స్వాగతం పలికారు.
అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో నిన్న, నేడు పర్యటిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి రోడ్ల అభివృద్ధికి పవన్ చొరవతో అడుగులు పడుతున్నాయి. కాగా ఈ పర్యటనలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ను రాజేంద్ర ప్రసాద్ శాలువాతో సన్మానించారు. అనంతరం ఇద్దరూ నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ఎందరో త్యాగధనుల ఫలితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్లో బస చేసి…
Vangalapudi Anitha: విజయనగరం జిల్లాలో నకలీ ఐపీఎస్ అధికారి గురించి ఎన్టీవీలో ప్రసారమైన వార్తలకు హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ వార్తపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే విచారణకు ఆదేశించారు. అలాగే, వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క మన్యం పర్యటనలో భద్రతా లోపం గుర్తించడంతో.. ఈ విషయం గురించి హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగిన బలివాడ…
తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు.