Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
- నేడు వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం.
- మొగిలిచెర్లలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న భట్టి.
- విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలపై సమీక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు (ఆదివారం) వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 15వ డివిజన్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి మొగిలిచెర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా.. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 1.45 గంటలకు హనుమకొండకు చేరుకుంటారు. అనంతరం 1.55 గంటల నుంచి 2.45 గంటల వరకు సుప్రభ హోటల్‌లో బస చేసి అక్కడి నుంచి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)కు వెళ్లనున్నారు. అక్కడ మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 3.30 గంటల వరకు ఐడీఓసీ లో అధికారులతో సమావేశమై, సబ్‌స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను చర్చిస్తారు.
Also Read: Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు
Also Read
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
ఆ తర్వాత మొగిలిచెర్లకు వెళ్లి గీసుకొండ మండలంలోని విశ్వనాథపురం, మొగిలిచెర్ల, గొర్రెకుంట ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు శిలాఫలకాన్ని ప్రతిష్టిస్తారు. ఆపై సాయంత్రం 4.30 గంటలకు మొగిలిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, ప్రజలను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. మొత్తానికి నేడు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు వరంగల్ జిల్లాలో బిజీబిజీగా గడపబోతున్నారు.
తాజావార్తలు
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!