Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ (శుక్రవారం) తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు.
మనుస్మృతి బోధించాలన్న లా ఫ్యాకల్టీ ప్రతిపాదనను ఢిల్లీ యూనివర్సిటీ తిరస్కరించింది. యూనివర్శిటీలో అది జరగదని డీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ తేల్చిచెప్పారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న నీట్ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. మే 5న మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం జరిగిన అవకతవకలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నీట్-యూజీ విచారణను వచ్చే గురువారం (జూలై 18కి) వాయిదా వేసింది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉంటారు. అలాంటిది కాసేపు క్రీడాకారిణిగా మారిపోయారు. కొద్దిసేపు షటిల్ రాకెట్ పట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె బ్యాడ్మింటన్ ఆడారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ ఆప్‌కు గుడ్‌బై చెప్పారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. కమలనాథులు.. కర్తార్ సింగ్ మెడలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది.
కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోకో పైలట్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లోకో పైలట్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌కు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్త నివాసంలో వంట మనిషిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతడిపై ఢిల్లీలో ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదైంది.