Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ
- నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా?
- రాజకీయంగా చర్చనీయాంశమైన నితీష్ వ్యవహారం
- మధ్యలో వచ్చేసిన బెంగాల్ సీఎం మమత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానింపబడ్డారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్డీయేతర ముఖ్యమంత్రులు గుర్రుగా ఉన్నారు. దీంతో వారు ఎవరు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం సపోర్టుతో ఏర్పడింది. అంతేకాకుండా బడ్జెట్‌లో బీహార్, ఏపీ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. ఏపీ సీఎం చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేశారు. ఇక శనివారం జరిగే సమావేశానికి చంద్రబాబు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. మరో మిత్ర పక్షమైన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ సమావేశం ఉందని ముందుగానే తెలిసినా.. హాజరు కాలేదు. ఇప్పుడిదే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకముందు.. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే లోక్‌సభలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో నితీష్‌కుమార్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు రావాలని.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్‌లో బీహార్ రోడ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినా.. జేడీయూ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో జేడీయూ అసంతృప్తిగానే ఉందని వార్తలు వినిపించాయి.
Also Read
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ఈ నేపథ్యంలోనే శనివారం మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి నితీష్‌కుమార్ హాజరుకాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్‌కు చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే వెళ్లారు. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రే స్వయంగా హాజరై.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించాల్సి ఉండగా.. నితీష్ హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సమావేశానికి ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ హాజరయ్యారు. కానీ సమావేశంలో ఎంత సేపు ఉండలేదు. వాకౌట్ చేసి బయటకు వచ్చి.. మీడియాతో ఆవేశంతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతుండగా.. తన మైక్ కట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులెవ్వరూ హాజరు కాకపోయినా.. తాను హాజరయ్యానని.. కానీ మాట్లాడే సమయం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అందుకే సమావేశం నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు.
ఇక సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ ఎందుకు హాజరు కాలేదన్నదే ఆసక్తిగా మారింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!