ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారికి చికిత్స చేయడం ప్రారంభించినప్పుడు.. మొదట్లో ఇది సాధారణ ఇన్ఫెక్షన్ అని వారు భావించారు.
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఓ వైపు మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపు దేశంలోని ధనవంతులపై ద్రవ్యోల్బణం ఎలాంటి ప్రభావం చూపడం లేదు.
ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. మీటింగ్ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.., నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌తో సమావేశం జరిగిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై సుదీర్ఘ చర్చ జరిగిందని అన్నారు. సోమవారం రోజున మళ్ళీ ఇంజనీర్ల స్థాయిలో సమావేశం…
ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ షుగర్ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు.
Kidney Sale Racket: ఐదు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కిడ్నీ విక్రయాల ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన వారి కిడ్నీలను విక్రయిస్తున్నారు. అవయవాలు అవసమున్న వారికి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
Air India: ఢిల్లీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-183 సాంకేతిక కారణాల వల్ల రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయం (UNKL)లో ల్యాండ్ చేయబడింది ఈ మేరకు విమానయాన సంస్థ సమాచారం ఇచ్చింది.
ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు.