ఢిల్లీలో ఈడీ బృందంపై భౌతిక దాడి జరిగింది. సైబర్ ఫ్రాడ్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేయడానికి బృందం ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతానికి చేరుకుంది. ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో కొంతమంది అక్కడకు వచ్చి వారి బృందంపై దాడి చేశారు.
READ MORE: Ponnam Prabhakar: విద్యార్థుల మీద రాజకీయం చేయవద్దు.. మంత్రి పొన్నం ఆగ్రహం..
వాస్తవానికి.. పీపీపీవైఎల్ (PPPYL) సైబర్ యాప్ మోసం కేసుకు సంబంధించి అశోక్ శర్మ, అతని సోదరుడి బిజ్వాసన్ ప్రాంతంలోని రహస్య స్థావరంపై దాడి చేయడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బృందం వెళ్ళింది. అశోక్ శర్మ, అతని సోదరుడు పీపీపీవైఎల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు. అయితే.. ఈ నిందితులకు సంబంధించిన బృందం తమపై దాడి చేసిందని ఈడీ అధికాలు ఆరోపించారు. ఈ దాడిలో అసిస్టెంట్ డైరెక్టర్ గాయపడ్డారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దాడి సమయంలో నిందితుల్లో పలువురు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు నిందితుడు అశోక్ కుమార్ బంధువు యష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సౌత్ వెస్ట్ జిల్లా డీసీపీ సురేంద్ర చౌదరి సమాచారం ఇచ్చారు.
READ MORE:Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వాయు కాలుష్యం