ముంబై ట్రాఫిక్ ఢిల్లీ కంటే చాలా బెటర్ అని.. ఇక్కడ ఎవరూ లైన్లను బ్రేక్ చేయరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ముంబై ట్రాఫిక్ గురించి ప్రశ్నగా… ముంబై ప్రజలు చాలా క్రమశిక్షణతో ఉంటారని.. ట్రాఫిక్ నియమాలు చాలా ఓపికగా పాటిస్తారని పేర్కొన్నారు. అందుకే ఢిల్లీ కంటే ముంబై చాలా బెటర్‌గా ఉందని చెప్పారు. ఢిల్లీలో రోడ్లపై కార్లు నలిగిపోవడం, కొన్ని సార్లు పక్కకు నెట్టేస్తారని.. అలాంటి పరిస్థితి ముంబైలో ఎక్కడా కనిపించదన్నారు.
సబర్బన్ రైల్వే నుంచి మెట్రో వరకు అన్ని వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయని స్పష్టం చేశారు. మొత్తం ప్రయాణాన్ని ఒకే యాప్‌లో ప్లాన్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఒకే టికెట్‌తో ఎవరైనా ఏదైనా ప్రజా రవాణాను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇక ముంబై మురికివాడలను నిర్మూలించామని.. 1 మిలియన్ మందికి స్థిర నివాసం కల్పించినట్లు చెప్పుకొచ్చారు. ఇది సాధ్యమైందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 7-8 సంవత్సరాల్లో ముంబైని మురికివాడల రహితంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇక మహాయతి కూటమి నుంచే ముంబై మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హిందువునని.. మరాఠీ వ్యక్తిగా గర్విస్తున్నానని.. మరాఠీల్లో ఎలాంటి వివక్ష లేదని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారంతా ముంబై వాసులేనని పేర్కొన్నారు. ఒక్క బంగ్లాదేశీయుడిని కూడా ఇక్కడ నివసించడానికి అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: అమిత్ షా ‘దుర్మార్గుడు.. నీచుడు’ హోంమంత్రిపై మమత ఆగ్రహం
ముంబైలో ఈనెల 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జనవరి 16న విడుదల కానున్నాయి. ఎన్నికల కోసం థాక్రే సోదరులు బరిలోకి దిగగా… మహాయతి కూటమి బరిలో ఉంది. రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఇది కూడా చదవండి: Stock Market: ఈనెల 15న స్టాక్ మార్కెట్‌కు సెలవు!.. కారణమిదే!