అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు కాకరేపుతున్నాయి. గురువారం కోల్‌కతాలో ఈడీ దాడులు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది. ఐ-ప్యాక్ డైరెక్టర్ ఇంటిపై సోదాలు చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దర్యాప్తును అడ్డుకున్నారు.
తాజాగా ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా ఇంటిని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ముట్టడించారు. ఈడీ దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ కక్షలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మాట్లాడుతూ.. ‘‘ఈడీ తప్పుగా సోదాలు నిర్వహించింది. ఇది అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికల్లో గెలవడానికి చేస్తున్న ప్రయత్నిస్తోంది.’’ అని అన్నారు. మరో ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ.. ‘‘నిన్న ఈడీ బృందాన్ని పంపారు. ఎన్నికల సమయంలోనే వారికి అన్నీ గుర్తుకొస్తాయి. కేవలం గెలవడం కోసమే ఎన్నికల సమయంలో ఈడీ, సీబీఐ బృందాలను పంపుతారు. కానీ వారు ఎన్నికలలో గెలవలేరు.’’ అన్నారు.
#WATCH | TMC MPs stage a protest outside the office of Union Home Minister Amit Shah in Delhi. pic.twitter.com/usyawPHycb
— ANI (@ANI) January 9, 2026
#WATCH | TMC MPs stage a protest outside the office of Union Home Minister Amit Shah in Delhi. pic.twitter.com/eFdkE3zcVi
— ANI (@ANI) January 9, 2026
#WATCH | Delhi | TMC MP Satabdi Roy says, "…They sent the team of ED yesterday and they remember everything during the time of elections…They send the teams of ED, CBI during the elections just to win, but they won't win the elections…" https://t.co/7B5PYqbnYa pic.twitter.com/S4wQjVjCSK
— ANI (@ANI) January 9, 2026
#WATCH | Delhi | TMC MP Kirti Azad says, "ED conducted the raids in a wrong way, and this is an attempt to win the elections in an undemocratic manner, BJP will not win the elections this manner…" https://t.co/qLa9j5jKKd pic.twitter.com/svmFWy0dg7
— ANI (@ANI) January 9, 2026