Drugs: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. 21 కోట్ల రూపాయల విలువ చేసే 1400 గ్రాముల కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి పొట్టలో దాచిన లేడి కిలాడితో మరో ప్రయాణీకుడు.. ఇద్దరి వ్యవహార శైలిలో అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్.. తమ దైన స్టైల్ లో ప్రశ్నించిన కస్టమ్స్.. పొట్టలో దాచిన కొకైన్ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. సదరు వ్యక్తిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం లేడి కిలాడి పొట్టలో 58 క్యాప్సూల్స్.. మరో ప్రయాణీకుడు దగ్గర 105 క్యాప్సూల్స్ బయటకు తీసిన వైద్యులు.. బ్రెజిల్ నుంచి ఢిల్లీ చేరుకున్న బ్రెజిల్ జాతీయులపై NDPS యాక్ట్ ప్రకారం కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.