ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. “ఇండియా టుడే” మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు. కేసీఆర్ మూడు లక్షల కోట్ల అప్పే అని చెప్పారన్నారు. తెలంగాణలో 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ.. మూడు నెలల్లో చేసింది తమ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. సౌత్ ప్రాతినిధ్యం తగ్గించే పనిలో బీజేపీ ఉందని పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణకు సౌత్ ఇండియా ప్రజలు కట్టుబడి ఉన్నారు.. ఇప్పుడు జనాభా ప్రకారం నియోజక వర్గాల విభజన అంటే ఎలా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్‌పై బీజేపీ విమర్శలు..
మోడీ జన గణన చేస్తున్నారు.. దాంట్లో కుల గణన కూడా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తాం అంటున్నామని చెప్పారు. మరోవైపు.. భాషను బలవంతంగా రుద్దొద్దని సూచించారు. ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.. రెండో భాష తెలుగు అని చెప్పారు. సివిల్స్‌లో తెలుగుని తొలగించారని తెలిపారు. కాంగ్రెస్ కు యూత్ కాంగ్రెస్.. మహిళా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఉన్నాయని వెల్లడించారు. కానీ మోడీకి ఈడీ, సీబీఐ, ఇన్‌కం టాక్స్‌లు అనుబంధ సంఘాలని విమర్శించారు.
Read Also: #Viral Prapancham Review: #వైరల్ ప్రపంచం రివ్యూ
కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ.. అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి వాళ్లను పక్కన పెడితే సైలెంట్‌గా ఉన్నారు.. తమ పార్టీలో రాజ్యసభ సీటు ఒక్కసారి ఇవ్వకపోతే జంతర మంతర్ లో ధర్నా చేస్తారు.. అంత ప్రజాస్వామ్యం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీలో అది సాధ్యమేనా అని అన్నారు. అదానీ 100 కోట్లు వెనక్కి ఇవ్వాలని పార్టీ చెప్పలేదు.. తాను భద్రాచలంలో రాముడి గుడి ఉందని చెప్పా.. మోడీ, అమిత్ షాలను పిలిచా ఇప్పటి వరకు రాలేదన్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లో ఒలంపిక్స్ నిర్వహించండి అని తాను లేఖ రాశానని తెలిపారు. అహ్మదాబాద్ కంటే తమ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.